ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది శృతిహాసన్. ఒకప్పుడు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత మాత్రం సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. తనకు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో లైవ్ మ్యూజిక్ అంటూ ఏదో కొత్తగా ట్రై చేసింది. కానీ అక్కడ వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ తనకు కలిసి వచ్చిన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే రవితేజ సరసన క్రాక్ అనే సినిమాలో నటించి రి ఎంట్రీ ఇవ్వగా.. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో శృతిహాసన్ కెరియర్ ఒక్కసారిగా జోరందుకుంది.

 ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల శృతిహాసన్ కాన్స్ చలనచిత్రోత్సవాల కార్యక్రమంలో పాల్గొంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోతో సమానమైన పారితోషకాన్ని అందుకోవడానికి నాకు రెండు దశాబ్దాల సమయం పట్టింది అని ప్రియాంక చోప్రా మాట్లాడింది. మరి ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించగా.. శృతిహాసన్ స్పందిస్తూ  ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


 ఒక సినిమాకు సంబంధించి హీరో హీరోయిన్ సమానమైన పారితోషకాన్ని అందుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంటూ శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అని చెప్పాలి. ప్రియాంక చోప్రా అద్భుతం సాధించారు. కానీ సమానమైన పారితోషకం  కోసం మేము ఇంకా కష్టపడుతున్నాం.. మన దగ్గర హీరోతో  హీరోయిన్ కి సమాన వేతనం అనే గురించి అసలు చర్చ కూడా లేదు అంటూ చెప్పుకొచ్చింది. గతంలో కూడా కాన్స్ ఫీలింగ్ ఫెస్టివల్లో పాల్గొన్నా. కానీ ఇప్పుడు తాను నటించిన ది ఐ ఇంటర్నేషనల్ ఫిలిం కోసం ఈ చిత్రోత్సవాల్లో పాల్గొనడం సరికొత్త అనుభూతిని ఇస్తుంది అంటూ శృతిహాసన్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: