ఆ సమయం లో శ్రీదేవి పై మండిపడిన రాధికా...!!

murali krishna
అతిలోకసుందరి అంటే వెంటనే గుర్తు వచ్చే హీరోయిన్ శ్రీదేవి. ఆమె మొదటి తరం హీరోలైన ఎన్టీఆర్ మరియు ఏయన్ఆర్ తో మొదలుపెట్టి ఆ తర్వాత వచ్చిన స్టార్ హీరోస్ అందరితో కూడా తెలుగు సినిమాల్లో నటించింది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ స్టార్ ఐకాన్ గా శ్రీదేవి ఎదిగినా కూడా ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి పునాది వేసిన తెలుగు ఇండస్ట్రీపై శ్రీదేవికి ప్రత్యేక గౌరవం అయితే ఉండేది.
కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీదేవి ఇప్పటికీ ఎంతో మంది ప్రేక్షకుల మదిలో అలానే నిలిచిపోయిందని తెలుస్తుంది.. ఆమె ఎంతో నిజాయితీగా ఉండే వారిని.. గొడవలకు చాలా దూరంగా ఉండే వారిని ఎంతోమంది ఆమెతో నటించిన నటులు చాలా సందర్భాల్లో అయితే చెప్పుకొచ్చారు. అయితే హీరోయిన్ రాధికతో శ్రీదేవి కలిసి నటించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. శ్రీదేవికి ఇండస్ట్రీలో పెద్దగా వివాదాలు ఉండేవి కాదు. అలాంటిది శ్రీదేవిపై రాధిక అప్పట్లో చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం గమనార్హం.
రాధిక, శ్రీదేవి కలిసి ఒక సినిమాలో నటించేటప్పుడు వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు అయితే జరిగాయని.. శ్రీదేవి పెద్ద తోపేం కాదు అంటు రాధిక గొడవ పడిందంటు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే శ్రీదేవి, రాధిక ఇద్దరు ఎప్పుడు ఎదురెదురుగా ఒక మాట కూడా అనుకోలేదని తెలుస్తుంది.. అలాగే కలిసిమెలిసి షాపింగ్ కూడా చేసేవారని సమాచారం.అసలు విషయానికి వస్తే ఒక తమిళ సినిమాలో రాధిక, శ్రీదేవి కలిసి నటించారటా.. అప్పటికే స్టార్ హీరోయిన్‌గా శ్రీదేవితో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలంటూ ప్రొడ్యూసర్ ని రాధిక డిమాండ్ కూడా చేసిందట.
ఇదే వారిద్దరి మధ్య కారణమైందని దాంతో గొడవ పెద్దదవుతుందని భావించిన ప్రొడ్యూసర్ శ్రీదేవిని పిలిపించి కాస్త పారితోషికాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని కూడా అడిగాడట అయితే అప్పటికే తెలుగు, తమిళ్, మలయాళం, బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా శ్రీదేవి గుర్తింపు తెచ్చుకోవడంతో దానికి అస్సలు ఒప్పుకోలేదట. ఇలాగే ఉంటే ఇక ఈ గొడవ పెద్దదవుతుందని భావించిన నిర్మాత రాధికను తీసేసి సరితని పెట్టి ఆ సినిమాను పూర్తి చేశాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: