ఓజీ పై షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja

‘సాహో’ ఘోర పరాజయం తరువాత పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ ను నమ్మి ఒక సినిమాను చేయడం ఎవరు నమ్మలేని విషయం అయితే ఆమూవీ షూటింగ్ తీస్తున్నపరుగులు మరింత షాకింగ్ గా మారాయి. పవన్ గ్యాంగ్ ష్టర్ అవతారంలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబాయ్ బ్యాక్ డ్రాప్ లో ఆమహానగరంలో కొన్ని ప్రదేశాలలో జరుగుతోంది.
 
 పవన్ మాఫియా లుక్ లో ఎలా కనిపిస్తాడు అన్న ఆశక్తి అభిమానులలో విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి ఎలాంటి ఫోటోలు వీడియోలు బయట పడకుండా దర్శకుడు సుజిత్ చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈమధ్యన పవర్ స్టార్ వీరాభిమానులను కొందర్ని ఎంపిక చేసి సుజిత్ ఈ మూవీ షూటింగ్ స్పాట్ కు తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
 
 
ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా పవన్ మాఫియా డాన్ లుక్ అతడి అభిమానులకు తెలిసిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తల హడావిడి జరుగుతోంది. అంతేకాదు తనను కలిసిన కొందరు పవర్ స్టార్ అభిమానులతో దర్శకుడు సుజిత్ ఈ మూవీ డిసెంబర్ రెండవ వారంలో విడుదల అవుతుంది అని లీకులు ఇచ్చినట్లు వార్తలు కూడ వస్తున్నాయి.
 
ఈవార్తలే నిజం అయితే ఈసంవత్సరం పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు విడుదల అవ్వడం పక్కా అనుకోవాలి. జూలై నెలలో ‘బ్రో’ అంటూ పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటే డిసెంబర్ లో ‘ఓమైగాడ్’ అంటూ రాబోతున్నాడనుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను అతడి అభిమానులు కోరుకునే గ్యాంగ్ ష్టర్ లుక్ లో పక్కా మాస్ మూవీగా రాబోతున్న ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అభిమానులు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. ‘బాలు’ ‘పంజా’ మూవీల తరువాత గ్యాంగ్ ష్టర్ మూవీలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నప్పటికీ గతంలో పవన్ నటించిన ఇలాంటి తరహా సినిమాలు ఫెయిల్ అయిన సందర్భం కూడ ఒక విధంగా అతడి అభిమానులను ఖంగారు పెట్టించే విషయం..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: