ఫ్లాప్ మూవీల తర్వాత 100 కోట్ల కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన హీరోలు వీరే..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప స్టార్ హీరోలు అయిన కానీ మంచి కథ , కథనం లేని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు అయితే వారికి అపజయాలు తప్పవు. అదే ఎంత చిన్న హీరో అయిన గొప్ప కథ , కథనాలతో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు అయితే ఆ సినిమాలకు బ్లాక్ బాస్టర్ లు విజయాలు దక్కడం కూడా పెద్ద కొత్తేమీ కాదు. ఇది ఇలా ఉంటే భారీ ఫ్లాప్ ల తర్వాత 100 కోట్లతో తిరిగి అద్భుతమైన ఫామ్ లోకి ఈ మధ్య కాలంలో తిరిగి వచ్చిన హీరోలు ఎవరో తెలుసుకుందాం.

రవితేజ : ఈ నటుడు పోయిన సంవత్సరం ఖిలాడి ... రామారావు ఆన్ డ్యూటీ ... ధమాకా అనే మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయలను అందుకున్నాయి. ఆ తర్వాత ధమాకా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ఈ సినిమాతో 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.

నాని : ఈ నటుడు కొంత కాలం క్రితం అంటే సుందరానికి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. తాజాగా ఈ హీరో దసరా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసింది.

సాయి ధరమ్ తేజ్ : ఈ నటుడు రిపబ్లిక్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్నాడు. తాజాగా సాయి తేజ్ "విరూపాక్ష" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది.

ఇలా ఈ ముగ్గురు హీరోలు అపజయాల తర్వాత బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: