సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మృతి..!!

Divya
గడిచిన కొద్దిరోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎంతోమంది నటీనటులను దర్శక నిర్మాతలను సైతం కోల్పోవడం జరిగిందితెలుగు ప్రేక్షకులు. తాజాగా ప్రముఖ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ నిన్నటి రోజున సాయంత్రం మరణించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. రాజ్ కోటి ఇద్దరు మంచి స్నేహితులు వీరిద్దరూ కూడా టాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించారు. పూర్తి పేరు తోటకూర సోమరాజు.. మ్యూజిక్ డైరెక్టర్ కోటితో కలిసి దాదాపుగా 150 సినిమాలకు పైగా సంగీతాన్ని అందించారు. ఇక వీరిద్దరి మ్యూజిక్ సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు పొందింది.
గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న రాజు నిన్నటి రోజున సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని తన గృహంలో కన్నుమూసినట్లు సమాచారం.దీంతో టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి.  ఈయన మరణ వార్త విని సినీ ప్రముఖుల సైతం ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆయనతో ఉన్న జ్ఞాపకాలను సైతం పలువురు సినీ సెలబ్రిటీలు సైతం తెలియజేస్తూ ఉన్నారు. రాజ్-కోటి మంచి స్నేహితులు  వీరిద్దరి తల్లిదండ్రులు టీవీ రాజు సాలూరి రాజేశ్వరరావు ఇద్దరు కూడా సంగీత దర్శకులే. వీరి రోజులు స్నేహితులుగా ఉండడం చేత రాజ్ - కోటి కూడా స్నేహితులుగా మారిపోయారు.

అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయినట్టు తెలుస్తోంది.గతంలో ఇద్దరూ దీని గురించి ప్రశ్నిస్తే మేము వర్క్ పరంగా విడిపోయాము సంగీత దర్శకులుగానే విడిపోయాము అంతేకానీ ఎప్పటికీ స్నేహితులుగానే కలిసే మాట్లాడుకుంటామని తెలిపారు. అయితే వీరిద్దరిని కలపాలని సినీ ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు ట్రై చేసిన వీరు కలిసి పనిచేయలేదని సమాచారం. అయితే విడిపోయిన తర్వాత గతంలో రాజ్- కోటి లను చెన్నైలోని ఒక కార్యక్రమానికి ఆహ్వానించి సత్కరించారు ఆ తర్వాత కూడా ఏదో తెలిసిన వాళ్ళలాగా కనిపిస్తే మాట్లాడుకోవడం తప్ప పెద్దగా క్లోజ్ గా లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: