చిన్నప్పుడే నట విశ్వరూపం చూపించిన మోహన్ లాల్?

Purushottham Vinay
మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళం టాప్ హీరోగా ప్రస్తుతం సూపర్ స్టార్ డం ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్నో డిఫరెంట్ రోల్స్ ఇంకా డిఫరెంట్ స్టోరీస్ అలాగే వాటికి తగ్గ మేకోవర్.. పాత్రలో పరకాయ ప్రవేశం.. పాత్రను ఓన్ చేసుకొనే తీరుతో ఎవరినైనా ఆశ్చర్యపరిచే టాలెంట్ మోహన్ లాల్ సొంతం.తన 40 ఏళ్ల సినీ కెరీర్ లో అన్ని రకాల పాత్రల్ని పోషించి మెప్పించారు ఆయన. పెక్యులర్ వాయిస్ ఇంకా వైవిధ్యమైన రీతిలో పలికే డైలాగ్స్ మలయాళీలను ఎంతగానో మంత్ర ముగ్ధుల్ని చేశాయి.ఇంకా ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి.ఈ రోజు ఆయన పుట్టినరోజు.ఇక మోహన్ లాల్ అసలు పేరు మోహన్ లాల్ విశ్వనాధ్ నాయర్. 1960 మే 21 పట్టణమిట్ట గ్రామంలో పుట్టిన ఆయన ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కేవలం ఆ వయస్సులోనే 90 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.


తన స్నేహితుల బలవంతం మీద సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1980లో సినీ రంగంలో ప్రవేశించిన మోహన్ లాల్ నాటి నుంచి నేటి దాకా విభిన్నపాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉన్నారు.ఇక  మన్యం పులి సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లు రాబట్టారు. ఆ తర్వాత లూసిఫర్‌తో తిరుగులేని హిట్ కొట్టారు. కథలో విషయం ఉండాలి కానీ భాష ముఖ్యం కాదు అని నమ్ముతాడు మోహన్ లాల్..అందుకే ఆయనను ఏకంగా ఐదు జాతీయ అవార్డులు వరించాయి.తెలుగులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ ఇంకా మళయాళంలో  పృథ్వి రాజ్ , అలాగే తమిళ్ లో ఆర్య,విజయ్,విశాల్ లాంటి హీరోలతో మల్టీస్టారర్ లు చేసి ఎంతగానో మెప్పించాడు. ఇక మోహన్ లాల్ 1988 వ సంవత్సరంలో సుచిత్ర ను వివాహమాడారు. వీరికి ప్రణవ్, విస్మయ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ప్రణవ్ కూడా ఇటీవలే హృదయం మూవీతో హీరోగా పరిచయమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: