ఎన్టీఆర్ సినిమాకి.. ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే?

praveen
కే జి ఎఫ్ 1,2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఊహించని క్రేజ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అతని టేకింగ్ కి అటు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు అనే విషయం తెలిసిందే. ఇక అతని దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలవుతున్న లీకుడ్ ఫోటోలే అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి.

 అయితే ఇక సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ పార్ట్ 3 కూడా చేయబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేసేందుకు సిద్ధమైపోయాడు ప్రశాంత్ నీల్. 2024 మార్చ్ నుంచి కూడా ఎన్టీఆర్ తో సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఎన్టీఆర్ తో సినిమా కోసం movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు భారీగానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారట.

 అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోవడం.. ఇక ప్రశాంత్ నీల్ ఇప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకోవడంతో.. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను ప్లాన్ చేస్తున్నారట movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి దాదాపు 50 కోట్ల దాకా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు అనేది తెలుస్తుంది. అయితే గతంలో కేజిఎఫ్ సినిమాకి ప్రశాంత్ నీల్ తీసుకున్న రెమ్యూనరేషన్తో పోల్చి చూస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాకు ఇస్తున్న రెమ్యూనరేషన్ డబుల్ అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: