గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఆది పురుష్ జైశ్రీరామ్ సాంగ్..!!

Divya
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తూ ఉన్నారు. దాదాపుగా రూ .600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని T -సిరీస్ తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ VFX కారణంగా ట్రోల్ కి గురి కావడం జరిగింది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా క్యూరియాసిటీ కూడా ప్రతిరోజు పెంచేస్తూనే ఉంది.

ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన సీత పాత్రలో కృతి సనన్ నటించగా సైఫ్ అలీ ఖాన్ రావణాసుడి పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొత్తం రామాయణం కథ అంశంతో తెరకెక్కించడంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి జైశ్రీరామ్ అనే పాట విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం. ఈ సాంగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. అలాంటి క్రేజీ ఉన్న జైశ్రీరామ్ సాంగ్ ఫుల్ వీడియోని ఈరోజున విడుదల చేయడం జరిగింది.

టీజర్ తో వచ్చిన నెగెటివిటీని పోగొట్టడానికి ఆది పురుష్ చిత్ర బృందం జైశ్రీరామ్ సాంగ్ నిలిచింది.ఈ సినిమాకు మంచి బూస్ట్ గా కూడా పనిచేస్తోంది .ఇప్పటివరకు ఫస్ట్ లుక్ టీజర్ మీద నుంచి వచ్చిన నెగెటివిటీ కాస్త ఈ సాంగ్తో పూర్తిగా చెరిపేసిందని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా మీద వస్తున్న ట్రోలింగ్ కూడా తగ్గిపోతుంది. జూన్ 16 న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవ్వడంతో ఇప్పటినుంచి ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ పాట తెగ వైరల్ గా మారుతోంది. మరి అభిమానులను ఈ సినిమా ఏ విధంగా మెర్పిస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: