ఆ సమయంలో ఎన్టీఆర్ కోసం తన కెరీర్ ను రిస్క్ లో పెట్టిన కాజల్..!!

murali krishna
ఏ స్టార్ హీరోయిన్ కు అయిన తను నటించిన హీరోలలో కొంత మంది హీరోలు అంటే  ప్రత్యేకమైన అభిమానం అయితే ఉంటుంది. ఆ అభిమానం వల్ల హీరోయిన్లు ఆ హీరోల కోసం కొన్నిసార్లు కెరీర్ ను రిస్క్ లో పెడుతుంటారు
అయితే జూనియర్ ఎన్టీఆర్ కోసం కాజల్ కూడా అలాంటి త్యాగం చేశారని తెలుస్తుంది.సాధారణంగా కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ లో చెయ్యడానికి అస్సలు  కూడా ఆసక్తి చూపరు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానం తో జనతా గ్యారేజ్ సినిమాలోని పక్కా లోకల్ సాంగ్ లో కాజల్ అదిరిపోయే స్టెప్పులు అయితే వేశారు. ఈ సినిమాకు ముందు తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా కాజల్ అగర్వాల్ మాత్రం ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగిందట.. ఎన్టీఆర్ కోసం కెరీర్ ను రిస్క్ లో పెట్టి మరి కాజల్ స్పెషల్ సాంగ్ చేయడం ఫ్యాన్స్ కు కూడా సంతోషాన్ని కలిగించింది.
ఎన్టీఆర్ కాజల్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల లో మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. బృందావనం, బాద్ షా, టెంపర్ సినిమాల లో కాజల్ నటించ గా జనతా గ్యారేజ్ సినిమా లో ఆమె స్పెషల్ సాంగ్ ను చేశారు. ఈ నాలుగు సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవడం విశేషం . ఎన్టీఆర్ కాజల్ కాంబో రిపీట్ కావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
కాజల్ ప్రస్తుతం రీఎంట్రీలో బాలకృష్ణకు జోడీగా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగులో తనకు పూర్వ వైభవం వస్తుందని కూడా ఆమె నమ్ముతున్నారు. కాజల్ అగర్వాల్ వయస్సు 37 సంవత్సరాలు కాగా పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ కు సినిమా ఆఫర్లు తగ్గుతుండటం సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: