కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఒక్కో మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్ లు ప్రతి సంవత్సరం వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలను అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతూ ఉంటారు. అలా సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ ... మోస్ట్ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి ... చందమామ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ... మగధీర మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగి పోయింది.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ కాలం లోనే ఎదిగిన కాజల్ ఆ తర్వాత అనేక తమిళ మూవీ లలో కూడా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే కాజల్ పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. పెళ్లికి ముందు వరకు స్టార్ యువ హీరోల సరసన నటించిన కాజల్ ప్రస్తుతం మాత్రం ఎక్కువ శాతం స్టార్ సీనియర్ హీరోల సరసన నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే పెళ్లికి ముందు వరకు ఒక్కో సినిమాకు 2 నుండి 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న కాజల్ పారితోషకం పెళ్లి అయిన తర్వాత తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న మూవీ లకు 50 నుండి 75 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ తెలుగు లో బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: