ఎన్టీఆర్ కోసం మరోసారి అలాంటి త్యాగం చేసిన పవన్ కళ్యాణ్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్  ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే.సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన అభిమానులే. ఆయన మంచి మనసును ఎందరో ప్రేమిస్తారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో సైతం ఎన్నోసార్లు తన మంచి మనసును చాటుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే తాజాగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో వీరిద్దరి కాంబినేషన్లో రానన్న సినిమా షూటింగ్ జరుగుతుంది. సాగర తీరాన్ని అడ్డంగా మార్చుకుని కొందరు అక్రమ మార్పులు చేస్తుంటే వారి వెన్నులో వణుకు పుట్టించే నాయకుడి కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు కొరటాల. 

ఇకపోతే ఈ సినిమా కోసం తన టైటిల్ ని సైతం త్యాగం చేసాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .అయితే ఎన్టీఆర్ 30 సినిమాకి ముందుగా దేవర టైటిల్ అయితే బాగుంటుందని అనుకున్నారు కొరటాల. ఇక ఈ టైటిల్ను ముందుగా పవన్ సినిమా కోసం అనుకున్నారట. ఇక ఆ విషయాన్ని తెలుసుకున్న పోరాటాల పవన్ కళ్యాణ్ ని సంప్రదించారట. విషం చెప్పగానే దేవర టైటిల్ ని ఎన్టీఆర్కు ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఓకే చేశారట. దీంతో ఎన్టీఆర్ సినిమాకి దేవర టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి దేవర టైటిల్ ని పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు తో కలిసి చేస్తున్న పీకే ఎస్డిటి కోసం అనుకున్నారట.

కానీ ఆ టైటిల్ను కొరటాలు అడగడంతో కాదనలేక పవన్ కళ్యాణ్ ఇచ్చేసాడట. దీంతో పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడంతో ఎన్టీఆర్ 30 కి దేవర అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెబుతున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం సైతం కురిపిస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్టీఆర్ విషయంలో పవన్ కళ్యాణ్ తన మంచి మనసును చాటుకున్నాడు. అప్పట్లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం తన షెడ్యూల్ను సైతం వాయిదా వేసుకున్నాడు. దాంతోపాటు ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: