ఎన్టీఆర్ కి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ సినిమాలో తన పాత్ర చాలా తక్కువగా ఉన్నప్పటికీ కొమరం భీమ్ పాత్రలో తన నటనకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు కొమరం భీమ్ పాత్ర ఒక ఎత్తు అయితే సినిమా ఒక ఎత్తు అని ఆయన మీద ప్రశంసల వర్షం సైతం కురిపించారు. ఇక అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం తన తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. 

అయితే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ అయినప్పటికీ ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తమ కుటుంబ సభ్యుడు అని చెప్పుకోవడానికి కూడా నందమూరి కుటుంబం అంగీకరించలేదు. సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఏదో మొక్కుబడిగా మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ కనిపించేవాడు. అనంతరం ఆయన చనిపోయిన తర్వాత నందమూరి కుటుంబం వీరిని పట్టించుకోవడం మానేశారు. కానీ ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ కి స్టార్ డం వచ్చిందో అప్పటినుండి నందమూరి కుటుంబం అని చెప్పుకుంటున్నారు. అయితే నందమూరి కుటుంబం ఎన్టీఆర్ ని ఎంతగా అవమానించినా కూడా ఎన్టీఆర్ వాటిని ఎప్పుడు కూడా మనసుకి తీసుకోలేదు. ఇంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు ఎన్టీఆర్ .

ఇక అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వాడితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఎవరైనా కోపం వస్తే ఇతరులపై అరుస్తారు లేదా ఖచ్చితంగా గొడవ చేస్తారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అలా చేయడట. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి కోపం వచ్చిన ప్రతిసారి వంటింట్లోకి వెళ్లి తనకి ఇష్టమైన వంట చేసి ఆయనే తింటాడట .ఇక ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు చెప్పడం జరిగింది. ఇక అలా వంట చేసి తన లో ఉన్న బాధని కోపాన్ని తగ్గించుకుంటాడట ఎన్టీఆర్. వంట చేసిన తరువాత మళ్ళీ మామూలుగా అయిపోతారట తనకి వచ్చిన బాధా కోపం పోవాలని వంట నేర్చుకున్నాడట ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: