ఎన్బికె 108 మూవీ ఆ జోనర్ మూవీ కాదంట..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్న అనిల్ రాగిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ ... వీర సింహా రెడ్డి లాంటి వరుస విజయాల తర్వాత బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న మూవీ కావడం ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ నెలలో విడుదల చేయనునట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరి కాంబినేషన్ లో ఇదే మొట్ట మొదటి సినిమా. ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి గతంలో రూపొందించిన అన్ని సినిమాల్లో కూడా కామెడీ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే హీరోలు కూడా అదిరిపోయే రేంజ్ లో కామెడీ చేస్తూ ప్రేక్షకులను లభిస్తుంటారు. దానితో బాలకృష్ణ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో అద్భుతమైన కామెడీ చేసి ప్రేక్షకులను నవ్వించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి.  కాకపోతే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తుంది. ఈ మూవీ లో బాలకృష్ణ పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ... కామెడీ సన్నివేశాలు పెద్దగా ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: