నిఖిల్ మనస్థాపానికి గురి కావడానికి కారణం....!!

murali krishna
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయిన అతి తక్కువమంది యువ హీరోలలో ఒకడు నిఖిల్.శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా నిఖిల్, ఆ చిత్రం గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ఇందులో మెయిన్ హీరో నటించిన వరుణ్ సందేశ్ కి వరుసగా రెండు సూపర్ హిట్స్ వచ్చాయి, కానీ నిఖిల్ కి సూపర్ హిట్ రావడానికి చాలా సమయం పట్టింది.ఆయన మొట్టమొదటి సూపర్ హిట్ సినిమా స్వామి రారా.సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఇక ఆ తర్వాత వరుసగా విభిన్నమైన కథలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇప్పుడు నిఖిల్ సినిమా వస్తుంది అంటే కచ్చితంగా థియేటర్ లో ఒకసారి చూడాలి అనే ఇమేజి మాత్రం ఏర్పడింది.ఇక రీసెంట్ గానే ఆయన కార్తికేయ 2చిత్రం తో పాన్ ఇండియా మొత్తం రీ సౌండ్ వచ్చే రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు.ఇదంతా పక్కన పెడితే కరోనా సమయం లో ఆపదలో ఉన్న జనాల కోసం, వాళ్లకి సహాయం చెయ్యాలనే తాపత్రయం తో ఎన్నో సేవా కార్యక్రమాలు తలపెట్టిన కొంతమంది సెలెబ్రిటీలలో ఒకరు నిఖిల్.ఎంతో మంది పేషెంట్స్ కి ఈయన మెడిసిన్ అందించడం, ఫుడ్ అందించడం వంటి కార్యక్రమాలు చేసాడు.
అయితే ఒకసారి లాక్ డౌన్ సమయం లో పోలీసులు రోడ్డు మీద ఎలాంటి వాహనాలను తిరగడానికి అనుమతిని ఇవ్వలేదు.ఆ సమయం లోనే నిఖిల్ కి హాస్పిటల్ లో ఎమర్జెన్సీ గా మెడిసిన్ అవసరం ఉంది ఒక పేషెంట్ కి అని ఫోన్ కాల్ రాగా, వెంటనే ఆయన తన కార్ లో మెడిసిన్ పట్టుకొని బయలుదేరాడు.కానీ రోడ్డు మధ్యలోనే ఆయనని పోలీసులు ఆపేసారు.
నిఖిల్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఇదే విషయం గురించి యాంకర్ అడగగా దానికి సమాధానం చెప్తూ హాస్పిటల్ లో పేషెంట్ కి అర్జెంటు గా మెడిసిన్ అందించాలి, అందుకే వెళ్తున్నాను అని చెప్పాను .ఈ పాస్ చూపించమని అడిగారు, ఆ సమయం లో సర్వర్ బిజీ గా ఉండడం వల్ల ఈ పాస్ జెనరేట్ అవ్వలేదు.అలా ఈ పాస్ లేనందుకు నాకు పది వేల రూపాయిలు జరిమానా వేశారు.
అది కట్టిన తర్వాతే అక్కడి నుండి పంపించారు అని నిఖిల్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో అప్పట్లో తెగ వైరల్ గా మారాయి.దీని గురించి ఆయన  కామెంట్కూడా వేసాడట, అది చూసి కమిషనర్ ఫోన్ చేసి నిఖిల్ కి క్షమాపణలు చెప్పాడట.ఇది జరిగి చాలా కాలం అయ్యినప్పటికీ రీసెంట్ గా సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ అవుతుంది.ఇకపోతే నిఖిల్ ప్రస్తుతం స్పై అనే చిత్రం లో నటించాడు.ఈ సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ వచ్చే నెలలో విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: