ఒకప్పటి స్టార్ హీరో మరదలి ని కాదన్నా సూపర్ స్టార్ కృష్ణ...!!

murali krishna
కృష్ణ, శోభన్ బాబులు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి స్నేహితులు. మొదటి నుండి చివరి వరకు తమ స్నేహాన్ని కొనసాగించారు వీళ్ళిద్దరూ. అయితే మధ్యలో శోభన్ బాబు తో బంధుత్వం కూడా కలవాల్సింది కానీ తెలుగు సినిమా పరిశ్రమలో అందరితోటీ కలివిడిగా వుండే హీరో ఎవరైనా వున్నారు అంటే అది ఒక్క సూపర్ స్టార్ కృష్ణ గారే. పరిశ్రమలో 'తేనె మనసులు' సినిమాతో హీరో ఎంట్రీ ఇచ్చి సుమారు 344 సినిమాల్లో హీరోగా నటించారు కృష్ణ. అయితే కృష్ణకి పరిశ్రమలో మంచి స్నేహితుడు ఎవరైనా వున్నారు అంటే అది ఒక్క శోభన్ బాబు  మాత్రమే. కృష్ణ, శోభన్ బాబు లు మంచి స్నేహితులే కాదు, ఇద్దరూ ఎప్పుడూ కలుసుకుంటూ ఉండేవారు కూడా. కృష్ణ ఎక్కువ శోభన్ బాబు ఇంట్లోనే ఉండేవారట. అలాగే కృష్ణ తల్లిదండ్రులు శోభన్ బాబు ని తమ పెద్దబ్బాయి గా చూసుకునేవారట. అందుకనే అతన్ని పెద్దబ్బాయి అనే పిలిచేవారట.
అయితే కృష్ణ మొదట్లో ఎక్కువగా శోభన్ బాబు ఇంట్లో ఉండేవారట. ఇద్దరూ తమ కష్టసుఖాలు ఒకరికొకరు చెప్పుకొని సేద తీరేవారట. అప్పట్లో శోభన్ బాబు మరదలు ఒకామె వచ్చి శోభన్ బాబు ఇంట్లో ఉంటూ ఉండేదట. శోభన్ బాబు కి తన మరదలని కృష్ణకి ఇచ్చి పెళ్ళిచెయ్యాలని అనుకున్నాడట. కానీ కృష్ణ తల్లి గారు, నాకు వచ్చే కోడలు నా కొడుకులా తెల్లగా వుండాలబ్బాయి, మరేమీ అనుకోకు అని శోభన్ బాబుకి చెప్పేసిందట. అలా నిజజీవితంలో బావాబావమరుదులు గా బంధుత్వం కలవాల్సిన కృష్ణ, శోభన్ బాబులకి ఆ సంబంధం అవలేదు.
అయితే విశేషం ఏంటంటే, దాని వల్ల కృష్ణ, శోభన్ బాబు ల స్నేహం చెడిపోలేదు అస్సలు. వాళ్లిద్దరూ కలిసే ఉండేవారు. కృష్ణ కి తరువాత ఇంద్రదేవితో పెళ్లయింది, కానీ చివరి వరకు కృష్ణ, శోభన్ బాబు ల స్నేహం మాత్రం అలానే చెక్కు చెదరకుండా ఉందిట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: