నరేష్ 1000 కోట్ల ఆస్థుల పై ఆసక్తికర చర్చలు !

Seetha Sailaja
నరేష్ 1000 కోట్ల ఆస్థుల పై ఆసక్తికర చర్చలు !

ఈ నెలలో విడుదల కాబోతున్న సీనియర్ నరేష్ పవిత్ర కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్ పై ఇండస్ట్రీ వర్గాలలో అదేవిధంగా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఉండే అనేకమంది హీరోలు హీరోయిన్స్ కు రెండు పెళ్ళిళ్ళు అంతకన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు జరిగిన సంఘటనలు ఉన్నాయి వాటిపై మీడియాలో అదేవిధంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు సెటైర్లు వచ్చాయి కానీ వాటిపై ఆ వార్తలకు సంబంధించిన హీరోలు హీరోయిన్స్ తమ వ్యక్తిగత జీవితాల పై వచ్చిన వార్తల పై సినిమాలు తీసిన సందర్భాలు చాలా తక్కువ.

అయితే నరేష్ తనకు ఇప్పటికే జరిగిన మూడు పెళ్ళిళ్ళ పై అదేవిధంగా కన్నడ నటి పవిత్ర తో తన ప్రేమ సహజీవనం విషయాలను హైలెట్ చేస్తూ తీసిన ‘మళ్ళీ పెళ్లి’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ ట్రైలర్ లో ఒక పాత్ర నరేష్ పాత్రను ఉద్దేశిస్తూ అతడు 1000 కోట్లకు అధిపతి అంటూ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ గా మారాదమే కాకుండా నరేష్ కు నిజంగానే నిజ జీవితంలో 1000 కోట్లు ఆస్థులు ఉన్నాయా ఆన్ విషయమై చర్చలు జరుగుతున్నాయి. 

వాస్తవానికి నరేష్ కామెడీ హీరోగా గతకాలంలో ఒక వెలుగు వెలిగాడు. అయితే అప్పట్లో హీరోలకు భారీ స్థాయిలో పారితోషికాలు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. మరి అలాంటి పరిస్తుతులలో నరేష్ కు 1000 కోట్ల ఆస్థి ఎలా వచ్చింది అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. 

మరికొందరైతే మూడు పెళ్ళిళ్ళ పై తీసిన ఈసినిమా కృష్ణ విజయనిర్మల మరణించిన తరువాత వస్తోంది కాబట్టి సమస్యలేదు కాని వారు జీవించి ఉండగా ఈసినిమా వస్తే చాలా ఇబ్బంది పడి ఉండేవారు అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఏమాత్రం అంచనాలు లేని చాలా చిన్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆలిస్టులోకి నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ చెరిపోతుందా అను మరికొందరు అంచనాలు వేస్తున్నారు..



ReplyForward

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: