చైతన్యతో విడాకులపై.. మొదటిసారి స్పందించిన నిహారిక?

praveen
గత కొంతకాలం నుంచి మెగా డాటర్ నిహారిక వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. దీనికంతటికీ కారణం నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంది అంటూ రూమర్స్ తెర మీదకి రావడమే. అయితే ఇప్పుడు వరకు ఇక ఇలాంటి వార్తలు గాసిప్స్ గానే మిగిలిపోయాయి. కానీ ఎవరూ దీనిపై స్పందించలేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్గా కొనసాగుతున్న నిహారిక చేసింది కొన్ని సినిమాలే. అయితే హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. కానీ మరిన్ని ప్రయత్నాలు చేసే లోపే 2020 లో చైతన్య జొన్నలగడ్డతో ఏడడుగులు వేసేసింది.

 వీరి వివాహం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పెళ్లి జరిగి ఇంకా మూడేళ్లు కూడా గడవకముందే.. అప్పుడే నిహారిక చైతన్య విడిపోతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. వీరి వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడ్డాయి అంటూ ఎక్కడ చుసిన ప్రచారం జరిగింది. అయితే ఒకవైపు చైతన్య మరోవైపు నిహారిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూస్తే నిజంగానే వీరి మధ్య విడాకులు జరిగాయి అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పెట్టిన వారి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేశారు.

 అయితే ఇప్పుడు వరకు ఈ విషయంపై ఎవరు స్పందించలేదు. అయితే తొలిసారి చైతన్యతో విడాకులపై నిహారిక స్పందించింది. ప్రస్తుతం మెగా డాటర్  నిహారిక డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎంతో ఆసక్తితో పరిశ్రమలో అడుగు పెట్టాను. వెండితెర ఓటిటి మాధ్యమం ఏదైనా సరే 100% కష్టపడతా. ఫ్యూచర్లో సినిమా ఛాన్సులు వస్తే కచ్చితంగా చేస్తాను. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ వల్ల మొదట్లో బాధపడిన.. తర్వాత పట్టించుకోవడం మానేశా. నా వైవాహిక జీవితం పై ఎన్నో వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదు ఆ పుకార్లపై నాకు స్పందించాలని కూడా లేదు అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: