సునిశిత్ ఈ షాక్ ఊహించిందే కదా..!

shami
సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువ అయిన ఈ టైం లో ఎవరు ఎప్పుడు ఎలా ఎవరి గురిచి చెబుతారు మాట్లాడుతారు అన్నది చెప్పడం కష్టంగా మారింది. సెలబ్రిటీస్ గురించి మాట్లాడి తాము ఫేమస్ అవుదామని కొందరు అనుకుంటారు. అయితే కొన్నిసార్లు అది తేడా కొట్టేస్తుంది. కొన్నాళ్లుగా సునిశిత్ అనే వ్యక్తి పలు ఇంటర్వ్యూస్ లో కనిపిస్తూ స్టార్ హీరోలందరికీ ఆ సినిమాలు తానే ఇచ్చేశానని చెబుతూ కనిపించాడు.
కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల ఆఫర్లు తన దగ్గరకు వచ్చాయని కానీ అది తన కన్నా ఆ స్టార్ కు బాగుంటుందని తానే వదిలేశానని సునిశిత్ చెబుతూ వచ్చాడు. అప్పట్లో ఇతని వీడియోలను బాగా వైరల్ చేశారు. ఆ తర్వాత ఇతను ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడని తెలిసి లైట్ తీసుకున్నారు. కానీ సునిశిత్ కి ఎప్పుడో ఒకసారి ఫ్యాన్స్ నుంచి గట్టి దెబ్బే తగులుతుందని అందరు అనుకున్నారు. ఊహించినట్టుగానే రాం చరణ్ ఫ్యాన్స్ నుంచి సునిశిత్ కి దేహశుద్ధి జరిగింది.
ఉపాసన గురించి ఏదో సంచలన వ్యాఖ్యలు చేశాడని సునిశిత్ ని చితక బాదేశారు మెగా ఫ్యాన్స్. ఫైనల్ గా అతను సారీ చెప్పి తనది తప్పైందని ఒప్పుకున్నాడు. సినిమా ఛాన్స్ ల విషయంలో వదిలేసిన ఫ్యాన్స్ ఇలా పర్సనల్ కామెంట్స్ చేస్తే మాత్రం తోలు వలిచేస్తారు. అభిమాన హీరోని ఒక్క మాట అంటే పడని ఫ్యాన్స్ ఉన్నప్పుడు మాట్లాడేప్పుడు కొద్దిగా కంట్రోల్డ్ గా ఉండాలి. లేదంటే సునిశిత్ కు జరిగినట్టే ట్రీట్ మెంట్ ఉంటుంది. మైక్ పెట్టగానే తామేదో తోపు అన్నట్టుగా ఫీల్ అయ్యి సెలబ్రిటీల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఈమధ్య అందరికీ చాలా కామన్ అయ్యింది. అయితే ఫ్యాన్స్ ఎందుకులే అని ఊరుకుంటే ఇలాంటి వారు మరీ అతి చేస్తుంటారు. అయితే ఇలా ఫ్యాన్స్ అందరు ఒక వ్యక్తిని కొట్టడం తప్పే అయినా సునిషిత్ చేసిన దానికి ఇది కరెక్టే అంటున్న వారే చాలా ఎక్కువమంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: