ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమా ఆదిపురుష్. ఈ సినిమా వచ్చేనెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు హిందీ తమిళం, మలయాళం ,కన్నడ భాషలలో విడుదల కానుంది.ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. శ్రీరాముడిగా ప్రభాస్ లుక్స్ పై ఒక రేంజ్ లో కామెంట్స్ వస్తున్నాయి .అంతేకాదు ట్రైలర్లో విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి అని అంటున్నారు. రామాయణాన్ని ఇంత లగ్జరీ స్కేల్లో సరికొత్త టెక్నాలజీతో ఇదివరకు ఎవరు కూడా సినిమాగా తీయలేదని0..

కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా భావిస్తున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. ఇక అసలు విషయం ఏంటంటే టీజర్ విడుదలైనప్పుడు ఫీడ్ బ్యాక్ బాగలేకపోవడం తో ఈ సినిమా విదలని సంక్రాంతి నుండి జూన్ 16న మార్చారు దీన్ని బట్టి చూస్తే గ్రాఫిక్స్ కోసం ఇంతకుముందు కంటే ఇప్పుడు డబల్ ఖర్చు అయ్యింది. అయితే కేవలం ప్రభాస్ మీద కోసం అయిన ఖర్చు ఇంకా షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి 10 కోట్ల రూపాయల వరకు అయినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ అంశం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ మారింది. ప్రభాస్ మేకప్ దగ్గర నుండి కంప్యూటర్ గ్రాఫిక్స్ లో చేసిన కొన్ని మార్పుల వరకు కేవలం ప్రభాస్ కోసం మాత్రమే ఈ ఖర్చు అయిందని తెలుస్తుంది. ఇక ప్రభాస్ కోసం ఇంత ఖర్చు చేసిన డైరెక్టర్ శ్రీరాముడికి మీసం ఉండదు అన్న విషయం తెలియదా అని కామెంట్స్ పెడుతున్నారు నటిజన్స్ .కానీ మరికొందరు మాత్రం రాముడు అంటే ఇలాగే ఉంటాడు అని అంటున్నారు. అయితే శ్రీరాముడి అసలు రూపం ఇలానే ఉంటుంది అంటూ గతంలో ఓం రౌత్ మీడియా కి చెప్పిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: