"ఉస్తాద్ భగత్ సింగ్" నుండి పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేసిన మూవీ బృందం..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఖరుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందినటువంటి భీమ్లా నాయక్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో దగ్గుపాటి రానా కూడా హీరో గా నటించాడు. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.
 

ఇలా భీమ్లా నాయక్ మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను "ఓజి" మూవీ లలోనూ నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ హీరో గా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి ఈ రోజు సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఫస్ట్     గ్లిమ్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఈ మూవీ నుండి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిటీ విడుదల చేసిన పోస్టర్ లో పవన్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ... కళ్లకు స్పెట్స్ పెట్టుకొని ... నడుం పై చేయి వేసుకొని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో నిల్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ లో పవన్ వెనకాల చాలా మంది నిల్చొని ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో కోసం పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: