"ఆది పురుష్" అన్ని భాషల ట్రైలర్లకు 24 గంటల్లో వచ్చిన వ్యూస్ ఇవే..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి సనన్ ... ప్రభాస్ కు జోడిగా నటించింది. ఓం రౌత్ మూవీ కి దర్శకత్వం వహించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జూన్ 16 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఈ మూవీ బృందం నిర్వహిస్తోంది.

అందులో భాగంగా నిన్న అనగా మే 9 వ తేదీన ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ను యూట్యూబ్ లో విడుదల చేసింది. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు 5 భాషల్లో కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క తెలుగు ట్రైలర్ ను రెండు యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయగా ఒక దానిలో ఈ ట్రైలర్ కు 10.60 మిలియన్ న్యూస్ , 551.8 కే లైక్స్ లభించాయి. మరొక చానల్లో అప్లోడ్ చేసిన తెలుగు ట్రైలర్ కు 3.19 మిలియన్ వ్యూస్ , 244.1కే లైక్స్ లభించాయి.

 ఈ మూవీ హిందీ ట్రైలర్ కు 24 గంటల్లో 52.22 మిలియన్ న్యూస్ , 1.09 మిలియన్ లైక్స్ లభించాయి. ఈ మూవీ తమిళ్ ట్రైలర్ కు 24 గంటల్లో 3.13 మిలియన్ న్యూస్ , 85.9 కే లైక్స్ లభించాయి. ఈ మూవీ మలయాళం ట్రైలర్ కు 24 గంటల్లో 3.12 మిలియన్ న్యూస్ , 66 కే  లైక్స్ లభించాయి. ఈ మూవీ కన్నడ ట్రైలర్ కు 24 గంటల్లో 1.76 మిలియన్ న్యూస్ ,  72 కే లైక్స్ లభించాయి. అన్ని భాషల్లో కలిపి మొత్తంగా 24 గంటల్లో ఈ సినిమా ట్రైలర్ కు 74.02 మిలియన్ వ్యూస్ , 2.11 కే లైక్స్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: