తమ్ముడి కెరీర్ సెట్ చేసే పని లో వున్న విజయ్ దేవరకొండ...!!

murali krishna
విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరో గా ఇండస్ట్రీ లో.మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు...ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయారు రౌడీ విజయ్ దేవరకొండ.
ఇక ఈ సినిమాతో వచ్చిన స్టార్డంతో చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా విజయ్ దేవరకొండ తో ఒక్కసారైనా డేటింగ్ చేయాలి అని భావిస్తున్నారట.. తెలుగు హీరోయిన్లే కాదు బాలీవుడ్ హీరోయిన్లకు కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం పెరిగింది. అలాంటి విజయ్ దేవరకొండ తాజాగా తన 34వ బర్త్ డే ని జరుపుకోబోతున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన బర్త్డేకి సంబంధించి వేడుకలు నిర్వహిస్తున్నారట.. ఇక ఆయన బర్త్డే సందర్భంగా విజయ్ దేవరకొండ గురించి కొన్ని తెలియని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ తండ్రి కూడా టాలీవుడ్ డైరెక్టర్ అని చాలామందికి అయితే తెలియదు. విజయ్ దేవరకొండ గోవర్ధన్ రావు డైరెక్టర్ కొడుకు. విజయ్ దేవరకొండ కేవలం హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే మంచి నిర్మాత కూడా అలాగే ఈయనకు ఏదైనా సృజనాత్మకంగా చేయడం ఎంతో ఇష్టమట. మొదటిసారి విజయ్ దేవరకొండకు అవార్డు వచ్చింది పెళ్లిచూపులు అనే సినిమాకి. ఈ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నేషనల్ అవార్డును అందుకుంది. ఇక ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.ఇక స్టార్ హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్ లను కూడా ఇంస్టాగ్రామ్ అభిమానుల విషయంలో వెనక్కి నెట్టేసాడు.. విజయ్ దేవరకొండ కు ఇష్టమైన హీరో షాహిద్ కపూర్. కబీర్ సింగ్ సినిమా చూసినప్పటి నుండి షాహిద్ కపూర్ కి విజయ్ దేవరకొండ వీరాభిమాని అయ్యారని తెలుస్తుంది.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వాళ్ల తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడట....అందుకే తమ్ముడు చేసే ఒక కొత్త సినిమా ఒక మేజర్ క్యారెక్టర్ లో విజయ్ కనిపించబోతున్నట్టు గా సమాచారం....ఆ క్యారెక్టర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని సమాచారం.…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: