పాన్ ఇండియా లెవెల్ లో గజిని-2..ఎప్పుడంటే..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది అది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక సినిమా స్టోరీ బాగుంటే చాలు కచ్చితంగా ఆ సినిమాని పాన్ ఇండియా లెవ్ లో  విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఇటు నటినటులు సైతం ఆసక్తి చూపుతున్నారు.అయితే ఇక్కడ హీరోతో చేసిన సినిమా కద ఇతర భాషలతో ఇతర హీరోలతో చేసేవారు. ఇక అలాంటి పరిస్థితులలో కూడా భారీ విజయాన్ని అందుకున్న సినిమాలలో గజిని సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా విడుదలై అన్ని భాషల్లో సైతం మంచి విజయాన్ని అందుకుంది. 

హీరో సూర్యను సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేశాడు దర్శకుడు. అయితే ఈ సినిమా గురించి సూర్య మురగదాస్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఈ సినిమా సీక్వెల్ చేసే ఆలోచనలో టాలీవుడ్ బాలీవుడ్ ఉన్నారని సమాచారం. ఇక ఈ సినిమా సీక్వెల్ లో నటుడు సూర్య కాకుండా అమీర్ ఖాన్ తో చేసే ప్లాన్లో ఉన్నారట. అయితే గతంలో కూడా బాలీవుడ్ లో గజినీ సినిమాలో అమీర్ ఖాన్ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి సినీ కెరియర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే గజినీ సినిమా సీక్వెల్లో మురుగదాసు డైరెక్టర్గా అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో ఈ సినిమా మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ మురుగదాస్ అమీర్ ఖాన్ అల్లు అరవింద్ మధ్య చర్చలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే లాల్ సింగ్ చెడ్డ సినిమాలో చివరగా నటించాడు అమీర్ ఖాన్. ఇక ఈ సినిమా తర్వాత తన తదుపరి సినిమా గజిని టు అని తెలుస్తోంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని కొట్టాలని చూస్తున్నాడట అమీర్ ఖాన్. ప్రస్తుతం గజిని 2 సినిమాకి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతుండగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: