అదే నా హాలిడే స్పాట్.. ఛాన్స్ దొరికితే అక్కడికే వెళ్తా?

praveen
ఉప్పెన అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైన కృతి శెట్టి.. ఇక మొదటి సినిమాతోనే సెన్సేషన్ విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తనఅందం అభినయంతో తెలుగు కుర్ర కారు మతి పోగొట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. హ్యాట్రిక్ విజయల తర్వాత మాత్రం ఈ అమ్మడికి  అదృష్టం అంతగా కలిసి రాలేదు. ఎందుకంటే చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు అని చెప్పాలి.

 అయితే ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది కృతి శెట్టి. అక్కినేని హీరో నాగచైతన్య సరసన కస్టడీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం కృతి శెట్టి బిజీ బిజీగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ .. తన కెరీర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..  ఖాళీ సమయంలో సరదాగా గడిపేందుకు ఏం చేస్తుంటారు అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పింది.

 భవిష్యత్తులో నాకు దర్శకత్వం చేయాలని ఉంది. అయితే ఇలా దర్శకురాలిగా మారడానికి మాత్రం ఇంకో పదేళ్లు సమయం పట్టొచ్చు అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది కృతి శెట్టి. అయితే ఇక నటిగా ఇంకా ఎన్నో నేర్చుకోవాలి. అందుకే నేను సెట్ లో ఉండగానే కేవలం నటిగా పరిమితం అవ్వకుండా.. చుట్టూ ఏం జరుగుతుంది.. దర్శకుడు ఏ సీను ఎలా తీస్తున్నారో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటా. నేనెప్పుడూ నా పనిని ఎంతో ఆస్వాదిస్తాను. ఒకవేళ నేను హాలిడే కి వెళ్ళాలి అన్న సెట్ కే వెళ్తాను. ఎప్పుడైనా సినిమాల నుంచి నాలుగైదు రోజులు విరామం దొరికితే ఎంతో బోరింగ్ గా అనిపిస్తుంది అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: