హనుమాన్ నిర్ణయంతో జోష్ లో ప్రభాస్ అభిమానులు !

Seetha Sailaja
తేజ సజ్జ హీరోగా నిర్మిస్తున్న ‘హనుమాన్’ మూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ గురించి చాలామంది ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికితోడు ఈ మూవీ టీజర్ లోని గ్రాఫిక్స్ ‘ఆదిపురుష్’ టీజర్ లోని గ్రాఫిక్స్ కంటే చాల మెరుగ్గా కనిపించడంతో ఈమూవీ మేకర్స్ నుండి ‘ఆదిపురుష్’ టీమ్ పాఠాలు నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడ విపరీతంగా వచ్చాయి.


దీనితో 5వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ‘ఆదిపురుష్’ కు ‘హనుమాన్’ పోటీనా అంటూ కొందరు ఆశ్చర్యపడ్డారు. వాస్తవానికి ‘హనుమాన్’ మూవీ ఈసమ్మర్ రేస్ లో విడుదలకావలసి ఉంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈమూవీ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా వాయిదా పడటానికి గల స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ వచ్చేనెల విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీ కథ అదేవిధంగా ‘హనుమాన్’ కథ ఇంచుమించు ఒకటే కావడంతో ‘ఆదిపురుష్’ కోసం ‘హనుమాన్’ ను పక్కకు పెట్టారా అన్నసందేహాలు వస్తున్నాయి.


ఇప్పుడు ఈవార్త వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు జోష్ లో ఉన్నారు. ‘ఆదిపురుష్’ కంటే ‘హనుమాన్’ ముందుగా విడుదలై ఘనవిజయం సాధించి ఆతరువాత ‘ఆదిపురుష్’ ఫెయిల్ అయితే అది చాల ఘోర అవమానంగా ఉంటుంది కాబట్టి ‘హనుమాన్’ మూవీ వాయిదా పడటమే మంచిది అన్న అభిప్రాయంలో ప్రభాస్ అభిమానులు ఉన్నారు.

వచ్చేనెల విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీని ప్రపంచవ్యాప్తంగా 1000 ధియేటర్లలో విడుదల చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ టాక్ ఎలా ఉన్నప్పటికీ మొదటివారం మూడురోజులలోనే అత్యంత భారీ కలక్షన్స్ రాబట్టాలని ఈమూవీ మేకర్స్ ప్లాన్. ఈసంవత్సరం సమ్మర్ రేస్ కు ముగింపు పలుకుతూ విడుదలకాబోతున్న మూవీ కావడంతో ఈమూవీ పై తెలుగు రాష్ట్రాలలో అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. రాముడు పాత్ర చెప్పగానే గుర్తుకు వచ్చే నందమూరి తారకరామారావు రూపంతో పోల్చకుండా ‘ఆదిపురుష్’ మూవీని డిఫరెంట్ గా చూడాలని మూవీ మేకర్స్ ప్రమోట్ చేయబోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: