న్యూ ప్లాన్ ఎంచుకున్న హరిహర వీరమల్లు !

Seetha Sailaja
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడుకున్నా దర్శకుడు క్రిష్ గురించి మాత్రమే చాల సానుభూతి చూపెడుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఘోర పరాజయం తరువాత అతడు వైష్ణవ్ తేజ్ తో తీసిన మూవీ కూడ ఫెయిల్ అవ్వడంతో క్రిష్ తో సినిమాలు తీయడానికి ఎవరు ఆశక్తి కనపరచడంలేదు. ఇలాంటి పరిస్థితులలో క్రిష్ కథను నమ్మి పవన్ కళ్యాణ్ ముందుకు రావడంతో ‘హరిహర వీరమల్లు’ ప్రారంభం అయింది.
 
 
 
ఈ మూవీ కరోనా వేవ్ లు మనదేశానికి రాకముందు ప్రారంభం అయింది. ఇప్పటికి మూడు సార్లు కరోనా వేవ్ లు వచ్చి వెళ్ళిపోయాయి కానీ కనీసం ఈ సినిమా 50 శాతం కూడ పూర్తి కాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తరువాత పవన్ మొదలుపెట్టిన ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ విడుదల కావడం ఆతరువాత మరో నాలుగు సినిమాలలో బిజీ కావడం జరిగిపోయింది కానీ ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడు పూర్తి అవుతుందో ఈ మూవీ దర్శకుడుకు అదేవిధంగా నిర్మాతకు తెలియని పరిస్థితిలో క్రిష్ పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు అనేకసార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
 
 
ఇలాంటి పరిస్థితుల మధ్య క్రిష్ ఒక మధ్య మార్గం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాకు సంబంధించి పవన్ పెద్దమనసు చేసుకుని 15 రోజులు డేట్స్ ఇస్తే ఈమూవీ కథలో మార్పులు చేసి ముందుగా ఈసినిమాను పార్ట్ వన్ గా మార్చి ఆతరువాత పార్ట్ 2 గురించి ఆలోచనలు చేయవచ్చని క్రిష్ పవన్ కు నచ్చచెప్పాలని చాల గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
 
 దీనితో పవన్ ప్రస్తుత సినిమాల బిజీ మధ్య క్రిష్ సూచనకు విలువ యిచ్చి సహకరించగలడా లేదంటే మరికొంతకాలం ‘హరిహర వీరమల్లు విషయంలో ఇదే తరహా మౌనాన్ని కొనసాగిస్తాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది  ఏమైనా క్రిష్ లాంటి టాలెంట్ ఉన్న దర్శకుడుకి ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటి అన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: