హీరో వినీత్ అక్క కూడా ఓ స్టార్ హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా..?

Anilkumar
'ప్రేమదేశం' హీరో వినీత్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇతను చేసింది తక్కువ సినిమాలే అయినా వాటితో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల సినిమాల్లో కూడా నటించాడు. 'సరిగమలు' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోగా పరిచయమైన వినీత్.. ప్రేమదేశం అనే సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రేమదేశం మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో వినీత్ కు యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అతని హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అప్పటి యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అలా తెలుగులో చివరగా 2006 లో 'థాంక్స్' అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. 


అయితే 2004లో ప్రిసిల్లా మీనన్ అనే అమ్మాయిని వినీత్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి అవంతి అనే కూతురు కూడా ఉంది. టాలీవుడ్ కి దూరమైనా కూడా మలయాళ, తమిళ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే  వినీత్ అక్క కూడా ఓ స్టార్ హీరోయిన్ అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన. తెలుగులో 'విక్రమ్' సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది శోభన. తర్వాత అప్పటి అగ్ర హీరోలు అందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె హీరోయిన్ గానే కాకుండా మంచి డాన్సర్ గా వేలాది ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఇక శోభనకి హీరో వినీత్ సోదరుడు అవుతాడు.

 

అలాగే వినీత్ మేనత్త ఒకప్పుడు బెస్ట్ యాక్టర్. ఆమె పేరు సుకుమారి. ఆరేళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బామ్మ వేషంలో ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించింది. అంతేకాదు 2003లో పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. అదే సమయంలో పూజ గదిలో పూజ చేస్తుండగా చీరకు నిప్పంటుకొని ఆమె తీవ్రంగా గాయపడింది. తర్వాత హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ హార్ట్ ఎటాక్ తో చనిపోయింది. ప్రస్తుతం వినీత్, శోభన ఇద్దరు కూడా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఇద్దరు మళ్లీ రీఎంట్రీ ఇస్తారేమో చూడాలి. అయితే చాలామందికి ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన వినీత్ కి అక్క అవుతుందనే విషయం తెలీదు...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: