ఈరోజు ఆ సమయానికి "కస్టడీ" మూవీ ట్రైలర్ విడుదల..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమాకు తమిళం లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ... కృతి శెట్టి ఈ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. ప్రియమణి ... అరవింద స్వామి కీలక పాత్రలలో కనిపించబోతున్న ఈ మూవీ కి ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాను ఏక కాలంలో తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందించారు. ఈ సినిమాను మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. ఈ సినిమా కనుక తెలుగు ... తమిళ భాషల్లో మంచి విజయం సాధించినట్లు అయితే తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా నాగ చైతన్య కు కృతి శెట్టి కి మంచి క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఈ రోజు అనగా మే 5 వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: