ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల అయిన "రామబాణం" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న మాస్ హీరోలలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే గోపీచంద్ తాజాగా "రామబాణం" అనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు , కుష్బూ ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ఈ రోజు అనగా మే 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఏ ఏరియాలో ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.

ఈ సినిమా నైజాం ఏరియాలో 210 థియేటర్ లలో విడుదల కానుండగా ... సీడెడ్ ఏరియా లో 110 థియేటర్ ల లోనూ .. ఆంధ్ర ఏరియాలో 300 థియేటర్ లలోనూ విడుదల కానుంది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 621 థియేటర్ లలో విడుదల కానుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ సినిమా 60 థియేటర్ లలో విడుదల కానుండగా ... ఓవర్ సీస్ లో 160 థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 840 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: