పుష్ప లో బన్వర్ సింగ్ పాత్ర కోసం.. సుక్కు మొదటి ఛాయిస్ ఎవరో తెలుసా?

praveen
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకేక్కిన  పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ని కాస్త ఐకానిక్ స్టార్ గా మార్చేసింది ఈ సినిమా. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని రీతిలో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కూడా ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

 ఇక ఈ సినిమా పాటలు అయితే వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కరిని ఉర్రూతలూగించాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ మూవీ తర్వాత అది సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా అల్లు అర్జున్ కు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇకపోతే ఇప్పుడు పుష్ప పార్ట్ 2 షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే పుష్ప సినిమాలో బన్నీ నటించిన పుష్ప రాజ్ పాత్ర తర్వాత ఇక ఆ రేంజ్ లో హైలైట్ గా మారిపోయిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది బన్వర్ సింగ్ షెకావత్.

 పుష్ప మొదటి పార్ట్ లో బన్వర్ సింగ్ షకవత్ ఏకంగా హీరోని భయపెట్టే పాత్రలో నటిస్తాడు. క్లైమాక్స్ లో కూడా వీరిద్దరి మధ్య ఎండింగ్ ఉంటుంది అని చెప్పాలి. దీంతో ఇక వీరిద్దరి మధ్య మొదలైన గొడవ ఎక్కడ వరకు దారితీస్తుంది అన్నదే పుష్ప రెండవ పార్ట్ లో చూపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఎంతో పవర్ఫుల్ రోల్ అయినా బనవర్సరీ శకావత్ పాత్రలో మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ నటించాడు. ఆ పాత్రలో పహాడ్ పాజిల్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు అభిమానులు. కానీ లెక్కల మాస్టర్ సుకుమార్ మాత్రం ఆ పాత్ర కోసం మరో హీరోని అనుకున్నాడట. అతను ఎవరో కాదు విజయ్ సేతుపతి. కానీ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న సేతుపతి డేట్స్ అడ్జస్ట్ చేయలేక మూవీని వదులుకున్నాడట. చివరికి ఆ తర్వాత ఈ పాత్రకు పహద్ ఫాసిల్ ని ఎంపిక చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: