సుజిత్ రాయబారానికి ఆలోచనలోపడ్డ పవన్ !

Seetha Sailaja
అకిరా నందన్ పవన్ వారసుడుగా హీరోగా ఎంట్రీ ఇచ్చే రోజుకోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అకిరా కూడ తరుచూ హైదరాబాద్ లో జరిగే ప్రీమియర్ షోలకు రావడంతో పాటు అడవి శేషుతో సాన్నిహిత్యంగా ఉంటూ సినిమాల పట్ల తనకు ఉన్న అభిరుచిని అందరికీ తెలిసేలా చేస్తున్నాడు. లేటెస్ట్ గా అకిరా సంగీత దర్శకుడుగా మారి ఒక షార్ట్ ఫిలింకు సంగీతాన్ని సమకూర్చిన విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ తో ‘ఓజి’ సినిమాను చేస్తున్న దర్శకుడు సుజిత్ కు ఒక ఆలోచన వచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది. ‘ఓజి’ లో పవన్ గ్యాంగ్ ష్టర్ గా మూడు టైమ్ ఫ్రేమ్స్ లో అతడి పాత్ర ఉంటుందట. అందులో ఒకటి 17 ఏళ్లు టీనేజ్ ప్రాయంలో ఉండే పాత్ర. ఆపాత్రను అకిరాతో చేయిస్తే బాగుంటుంది అన్నఆలోచన సుజిత్ కు రావడంతో ఈవిషయాన్ని పవన్ దృష్టికి అతడు తీసుకు వేల్లిన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సూచన పై పవన్ తన నిర్ణయాన్ని వెంటనే చెప్పకుండా ఆలోచించి చెపుతాను అని చెప్పినట్లు టాక్. వాస్తవానికి అకిరా నందన్ కు సినిమా లపై ఉన్న ఆశక్తి రీత్యా అతడిని ప్రోత్సహించే ఉద్దేశ్యం పవన్ కు ఉన్నప్పటికీ ఇంత చిన్న వయసులో బిగ్ స్క్రీన్ పై అకిరా ను చూపెడితే అతడు హీరో అయ్యేవరకు ఆ క్రేజ్ ఉంటుందా లేదా అన్న ఉద్దేశ్యాన్ని పవన్ తనకు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిప్రాయం కూడ తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు.

అయితే త్రివిక్రమ్ పవన్ కు ఏసలహా ఇచ్చినా ఆ సలహా అతడి జాతకరీత్యా ఉన్న యోగాలను బట్టి సలహాలు ఇస్తూ ఉంటాడు కాబట్టీ అకిరా విషయంలో తొందరపడి ఒక నిర్ణయం రాకపోవచ్చు అన్న సూచనలు కూడ వినిపిస్తున్నాయి. కానీ పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలోకి ప్రచారంలోకి వచ్చిన ఈవార్త నిజం కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: