బాలయ్య సినిమాలో ఆ సీన్స్ హైలెట్ అట..!

shami
వీర సింహా రెడ్డి సూపర్ హిట్ అవడంతో బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాను మరింత జోష్ గా చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తున్న బాలకృష్ణ 108 సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ సరసన కెరీర్ లో మొదటిసారి నటిస్తుంది కాజల్ అగర్వాల్ అమ్మడు పెళ్లి తర్వాత ఏ సినిమా అయినా ఓకే చేస్తుంది ఈ క్రమంలో బాలయ్యతో ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకుని ఓకే చేసింది. ఇక ఇదే సినిమాలో కన్నడ భామ శ్రీ లీల కూడా నటిస్తుంది. ఈ ఇద్దరు సినిమాకు మేజర్ హైలెట్ గా నిలుస్తారని టక్.
అంతేకాదు అనీల్ రావిపుడి ఈ సినిమాలో జైలు సీన్ ఒకటి ప్లాన్ చేశారట ఆ సీన్ నందమూరి ఫ్యాన్స్ సీట్లలో అసలు కూర్చోలేరని సినిమా మొత్తానికి హై తెచ్చే సీన్ ఇదే అని.. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సీన్ రష్ చూస్తేనే అదిరిపోయిందని అనిపించిందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. బాలయ్య సినిమాకు ఈమాత్రం స్టఫ్ ఉంటే చాలు మిగతాదంతా ఫ్యాన్స్ చూసుకుంటారు. తన మొదటి సినిమా పటాస్ నుంచి కొడితే హిట్టే అన్నట్టుగా కష్టపడుతున్న అనీల్ రావిపుడి బాలయ్యతో కూడా అదిరిపోయే సినిమా చేస్తున్నారట.
ఈ సినిమాలో అనీల్ మార్క్ కామెడీని చూపిస్తూనే బాలకృష్ణ నుంచి ఆశించే అన్ని మాస్ అంశాలు ప్లాన్ చేశారట. బాలయ్య 108 సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన లుక్ పోస్టర్స్ అన్ని ఫ్యాన్స్ కి బాగా నచ్చేశాయి. దసరా బరిలో దూసుకొస్తున్న ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ కి ఎలాంటి ఫీస్ట్ అందిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత బాలయ్య అఖండ 2 సినిమా చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ తో సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే బాలకృష్ణ సినిమా మొదలు పెడతారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: