అంత బడ్జెట్ పెట్టి స్క్రిప్ట్ లేకుండా రిస్క్ చేశారా..?

shami
అఖిల్ హీరోగా ఏజెంట్ అంటూ ఒక సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజైంది. ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. సైరా నర సిం హా రెడ్డి తర్వాత సురేందర్ రెడ్డికి ఏ హీరో ఛాన్స్ ఇవ్వకపోవడంతో వక్కంతం వంశీ కథ్తో అఖిల్ ని ఒప్పించి సినిమా ఫిక్స్ చేసుకున్నారు. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు ముందు ఒక సర్టెన్ బడ్జెట్ అనుకోగా సినిమా స్టైలిష్ గా తీయాలని అనుకుని అనుకోకుండానే నిర్మాణ వ్యయం పెంచేశారు. ఫైనల్ గా సినిమా పూర్తయ్యే సరికి 80 కోట్ల దాకా సినిమా బడ్జెట్ అయ్యింది.
ఇంత బడ్జెట్ పెట్టారు కదా అని సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ఊహించుకుంటే థియేటర్ లో సినిమా చూసిన ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. ఏజెంట్ ఒక సరైన కథ కథనాలు లేని సినిమాగా వచ్చింది. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేస్తూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియాలో మెసేజ్ చేశారు. సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే సెట్స్ మీదకు వెళ్లిందని అనారు. అక్కడే ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. 80 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాకు పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రెడీ కాకుండా ఎలా వెళ్లారంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
సురేందర్ రెడ్డి స్టార్ డైరెక్టర్ అఖిల్ యంగ్ అండ్ డైనమిక్ హీరో ఈ కాంబో కి తిరుగు లేదని సినిమా తీసి ఉండొచ్చు అంతేకానీ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అవకుండా సెట్స్ మీదకు తీసుకెళ్లడం మరీ దారుణమని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఈ ఫెయిల్యూర్ తాలూఖా ట్రోల్స్ అన్నిటినీ ఏజెంట్ యూనిట్ భరించాల్సి వస్తుంది. నిర్మాత అనిల్ సుంకర ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం గురించి కూడా ఆయన డేర్ నెస్ కి సూపర్ హ్యాట్సాఫ్ అంటూ చెప్పుకుంటున్నారు. అనిల్ సుంకర నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: