సాంబా ఓ పాటేస్కో..!

shami
పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఈ సినిమా విషయంలో జరుగుతున్న లేట్ వల్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ సినిమాపై ఆసక్తి కోల్పోయారు. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుంది. 17వ శతాబ్ధం కాలం కథతో వస్తున్న ఈ సినిమాలో పవన్ స్పెషల్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమా కు ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
సినిమాలో సాంగ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని అంటున్నారు. అయితే పవన్ సినిమా లో సరదాగా ఆయన కూడా గొంతు సవరించుకుని పాటలు పాడుతుంటారు. అలానే పవన్ వీరమల్లు సినిమాకు తన గాత్ర మాధుర్యాన్ని వినిపించబోతున్నారట. కీరవాణి కోరిక మేరకు పవన్ వీరమల్లులో ఒక బిట్ సాంగ్ పాడుతున్నారని తెలుస్తుంది. పవన్ సాంగ్ పాడితే ఆ సినిమా హిట్టే అన్న సెంటిమెంట్ కూడా ఉంది. మరి వీరమల్లులో పవన్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ భామ జాక్వెలిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది.  
పవన్ సినిమాల్లో పాట పాడటం చాలా కామన్ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఆయన సింగింగ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో జోవియల్ మూడ్ లో ఇక్కడ ఒక సరదా సాంగ్ వస్తే బాగుండు అనుకునే టైం లో పవన్ సాంగ్ ఉంటుంది. అంతకుముందు ఆయన పాడిన పాటల సందర్భాలు కూడా అవే. సో వీరమల్లు సినిమాలో కూడా పవన్ అలాంటి పాటతోనే అలరిస్తారని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ పై ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. అసలైతే ఈ ఏడాది సంక్రాంతికే అనుకున్న రిలీజ్ సమ్మర్ వెళ్తున్నా సినిమా విషయంపై క్లారిటీ రావట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: