"ఆది పురుష్" మూవీ ట్రైలర్ కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ సినిమాని ఈ సంవత్సరం జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ కు సంబంధించిన ఒక అదిరిపోయే వార్త తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మే 9 వ తేదీన ఈ మూవీ మేకర్స్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ ను మే 8 వ తేదీన కొన్ని సెలెక్టెడ్ థియేటర్ స్క్రీన్ లలో మొదటగా ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ సినిమా ట్రైలర్ ను బయటకు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనుండగా ... కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతోంది.

ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ కి భారీ గ్రాఫిక్స్ పనులు ఉండడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకి చాలా సమయం పట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: