మళ్ళీ తెరమీదకు చెల్లెలి సెంటిమెంట్ !

Seetha Sailaja
టాలీవుడ్ కమర్షియల్ సినిమా పుట్టిన నాటి నుండి సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అక్కినేని ఎన్టీఆర్ నుండి నేటితరం తరం టాప్ యంగ్ హీరోల వరకు చాలమందికి సిస్టర్ సెంటిమెంట్ తో చేసిన సినిమాలు బ్లాక్ బష్టర్ హిట్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులకు ‘బిచ్చగాడు’ మూవీతో పరిచయం అయిన విజయ్ ఆంటోని ఆతరువాత నటించిన అనేక సినిమాలు ఫెయిల్ అయ్యాయి.

దీనితో తనకు హిట్ ఇచ్చిన ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ ను నమ్ముకుని ‘బిచ్చగాడు 2’ రాబోతున్నాడు. ఈ మూవీ ట్రైలర్ కు వచ్చిన స్పందనను బట్టి ఈ మూవీ హిట్ అవుతుందా అన్న సందేహాలు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకడైన విజయ్ కురుమూర్తి పాత్రలో విజయ్ ఆంటోనీ నటిస్తున్నాడు.

అతడిని అంతం చేసి లక్షల కోట్ల విలువైన సంపదను హస్తగతం చేసుకోవాలని కొంతమంది కుట్రలు చేస్తూ ఉంటారు. ఈలోగా అతని హత్య జరిగిపోతుంది మర్డర్ చేసిన హంతకుడు అతని పోలికల్లోనే ఉండటం పోలీసులకు న్యాయశాఖకు సవాల్ గా మారుతుంది. అయ్యప్ప మాలలో అతి సామన్యుడిగా కనిపించే ఈవ్యక్తికి గుండెలు పిండేసే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో ప్రాణంగా ప్రేమించిన చెల్లెలు కూడ ఉంటుంది. అయితే అయ్యప్ప మాలలో ఉన్న విజయ్ ఆంటోని అత్యంత ధనవంతుడైన విజయ్ కురుమూర్తి ఒకడేనా అన్నది సస్పెన్స్. ఈ ట్రైలర్ విజువల్స్ చాల బాగుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.

విజయ్ ఆంటోనీ ఎప్పటిలాగే తన మార్కు యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఈ క్రైమ్ కం సస్పెన్స్ డ్రామాలో ఎమోషన్లు గట్టిగానే కనిపిస్తున్నాయి. సస్పెన్స్ నచ్చితే ఈసినిమా సూపర్ హిట్ అయ్యే ఆస్కారం ఉంది. తన సొంత ప్రొడక్షన్ కావడంతో ఈ ‘బిచ్చగాడు’ హీరో ఈ మూవీ పై చాల బడ్జెట్ ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ‘పొన్నియన్ సెల్వన్ 2’ హిట్ టాక్ రావడంతో ఈమూవీ విడుదల వాయిదా వేసి మే 19న రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: