ఆదిపురుష్ ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..!?

Anilkumar
టి సిరీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరక్కెక్కిన సినిమాల్లో ఆది పురష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించడం జరుగుతుంది. ఇక ఇప్పుడిప్పుడే ఈ సేమాపై పాజిటివ్ టాక్ కూడా పెరుగుతుంది అని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కానుంది.మే 4వ తేదీన లేదా 17వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల కానని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర బృందం చేయనున్నారు. అయితే తాజాగా ఆది పురుష డైరెక్టర్ ఓం రత్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. 

ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఆది పురుష మూవీ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆయన తెలియజేశారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత ఈ సినిమాపై ఖచ్చితంగా అందరిలోనూ అంచనాలు మరింత పెరిగిపోతాయని కూడా ఆయన తెలియజేశారు. చిత్ర బృందం ఈ సినిమా రిసల్ట్ పై చాలా నమ్మకంతో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తామని ఆయన అభిప్రాయాన్ని తెలియపరిచాడు. మరో 45 రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తోంది.

సాహో,  రాదే శ్యామ్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ప్రభాస్ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ సినిమా గనక సక్సెస్ సాధిస్తే ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి 2 సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్ ఖాతాలో లేదు అనే చెప్పాలి. ఈ సినిమా గనక మంచి విజయాన్ని అందుకుంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు అని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: