నాని 30వ మూవీలో కీలక పాత్రలో ఆ స్టార్ హీరోయిన్..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన విడుదల అయిన పాన్ ఇండియా మూవీ దసరా తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. దసరా లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత నాని ప్రస్తుతం తన కెరియర్ లో  30 వ మూవీ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి  సౌర్యవ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... నాని సరసన ఈ మూవీ లో మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవా లో జరుగుతుంది. గోవా లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో ప్రస్తుతం నాని తో పాటు మృణాల్ కూడా పాల్గొంటుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ నాని మరియు మృణాల్ పై ఈ సినిమా లోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న శృతి హాసన్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే బయటికి రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శృతి హాసన్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ... ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు ...  సినిమాను ఈ ముద్దు గుమ్మ పాత్ర మలుపు తిప్పనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎలా ఉండే ప్రస్తుతం శృతి హాసన్ ... ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: