"లియో" మూవీలో ఆ సన్నివేశాలు అదిరిపోనున్నాయట..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ ప్రస్తుతం లియో అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు .

ఇది ఇలా ఉంటే లోకేష్ కనకరాజు తన కెరియర్ లో ఇప్పటి వరకు తక్కువ మూవీ లకే దర్శకత్వం వహించిన దర్శకత్వం వహించిన దాదాపు ప్రతి మూవీ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ఇప్పటి వరకు తన కెరియర్ లో దర్శకత్వం వహించిన సినిమా లలో మా నగరం సినిమాను మినహాయిస్తే ఖైదీ ... మాస్టర్ ... విక్రమ్ మూవీ లలో భారీ యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరించాడు. అలాగే ఈ మూవీ ల లోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు రూపొందిస్తున్న లియో మూవీ లో కూడా అదిరిపోయే రేంజ్ యాక్షన్స్ సన్ని వేషాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: