బుల్లితెరపై రెండవసారి కూడా అదరగొట్టిన రవితేజ "ధమాకా" మూవీ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో మొదటగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి మూవీ తో రవితేజ ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించ లేక పోయింది. ఆ తర్వాత రవితేజ ... శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లో హీరో గా నటించాడు.

ఈ మూవీ కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం చివరన రవితేజ హీరో గా రూపొందిన ధమాకా మూవీ విడుదల అయింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లు కూడా దక్కాయి.  ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీ ప్రస్తుతం బుల్లి తెర ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.

ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 10.08 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రెండవ సారి బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ సినిమాకు రెండవ సారి కూడా బుల్లి తెరపై సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ రెండవ సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 6.31 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సాలిడ్ బ్లాక్ బాస్టర్ మూవీ కి త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించగా ... శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: