కిల్లింగ్ లుక్స్ తో అదరగొడుతున్న సమంత..!!

murali krishna
సమంత రూత్ ప్రభూ గురించి అందరికి బాగా తెలుసు.. ఈమె తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను కూడా ఏర్పరుచుకుంది. సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఈ రోజు తన పుట్టిన రోజు జరుపు కుంటుంది..
ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుండి బర్త్ డే కానుకగా పోస్టర్ ను విడుదల చేసారు.. ఇటీవలే ఈ భామ శాకుంతలం సినిమాతో వచ్చి భారీ డిజాస్టర్ ను అందుకుంది.
ఈ సినిమాతో ఈమె తన ఫ్యాన్స్ ను కూడా మెప్పించలేక పోయింది.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమాతో ఈమె కొద్దిగా విమర్శలు కూడా అందుకుంది. అయితే ఈ ప్లాప్ నుండి బయటకు వచ్చి తన నెక్స్ట్ సినిమాలపై ద్రుష్టి పెట్టింది. ఈమె లైనప్ లో ఉన్న చిత్రాల్లో ''ఖుషి'' సినిమా కూడా ఒకటి.. విజయ్ దేవరకొండ , సమంత కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది..
ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపు కుంటుంది. మరి ఈ సినిమా నుండి సమంత పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ ను విడుదల చేసారు.. సమంత పంజాబీ డ్రెస్ లో మెడలో ఐడి కార్డుతో మెస్మరైజింగ్ స్మైల్ తో ఆఫీస్ కు వెళుతున్న ఉద్యోగి తరహాలో ఈమె క్యాజువల్ లుక్ కూడా అదరగొడుతుంది.. స్మైల్ తోనే కిల్ చేస్తున్న ఈ పోస్టర్ ఆమె ఫ్యాన్స్ ను అయితే బాగా ఆకట్టు కుంటుంది. ఈ పోస్టర్ ద్వారా సామ్ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్ర చేసినట్టు అర్ధం అవుతుంది. చూడాలి ఈ పాత్రతో ఏ స్థాయిలో ఈమె ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో.. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడట.. సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: