విరూపాక్ష: వారం దాటినా అస్సలు తగ్గట్లేదుగా?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో మెగా కాంపౌండ్ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తరువాత బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. విరూపాక్ష సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. హారర్ బ్యాక్ డ్రాప్ లో చేసిన విరూపాక్ష సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఇక గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డేనే జనాల నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. వీకెండ్ తరువాత కూడా అదే రేంజ్ లో ఈ సినిమాకి భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి.సుకుమార్, బీవీఎస్ఏన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి కొత్త డైరెక్టర్ కార్తిక్ దండు దర్శకత్వం వహించగా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాకు సగం సుకుమార్ వల్లే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇక ఈ సినిమా డిమాండ్ కు తగ్గట్టుగా మంచి బిజినెస్ అయితే క్తియేట్ చేసింది. విరూపాక్ష సినిమా ఏపి నైజాంలో మొత్తం 19.20 కోట్ల దాకా బిజినెస్ చేయగా ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని మొత్తం 22.20 కోట్ల బిజినెస్  చేసింది.


ఇక వీకెండ్ తరువాత కూడా సినిమాకు థియేట్రికల్ ఆక్యుపెన్సీ చాలా సూపర్ గా నమోదవుతుంది. ఇక 4వ రోజుకే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ అయ్యింది. వీకెండ్ తరువాత సినిమాకు అసలు పరీక్ష మొదలైంది. అయినప్పటికీ ఈ సినిమా ఏమాత్రం డౌన్ అవ్వకుండా మంచి థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. 7వ రోజు ఉదయం షోలకు 13% ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న విరుపాక్ష మూవీకి మధ్యాహ్నం 22.45% నమోదయింది. ఇక సాయంత్రం షోలకు 20.18% నమోదైనట్లు సమాచారం తెలుస్తుంది. నైట్ షోలకు కూడా రెస్పాన్స్ అద్భుతంగానే ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది.ముఖ్యంగా US లో మాత్రం ఈ సినిమా ఏమాత్రం తగ్గేదేలె అన్నట్లు ఎక్కడా స్లో డౌన్ అవ్వకుండా దూసుకుపోతుంది.ఇప్పటిదాకా మొత్తంగా ఈ సినిమాకి దాదాపు 30 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. ఇక గ్రాస్ దాదాపు 60 కోట్ల దాకా వచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: