హ్యాపీడేస్ మూవీలో నటించిన హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2007లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో యువతకి చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో అప్పుడు నటించిన వారందరూ కొత్త వాళ్లే అయినప్పటికీ చాలా బాగా నటించారు. ఇక ఆ సినిమా నుండి వరుణ్ సందేశ్ తమన్నా కి మంచి క్రేజ్ లభించింది. వారిద్దరితోపాటు ఈ సినిమాలో చాలామంది నటించారు  ఇక అలా వారిలో మరొక జోడి రాహుల్ ,సోనియా దీప్తి. ముఖ్యంగా ఈమె తన రింగు రింగుల జుట్టుతో అందరిని తెగ ఆకట్టుకుంది. సోనియా హైదరాబాద్ అమ్మాయి  ఆమె ఇక్కడే పుట్టి పెరిగింది కంప్యూటర్ అప్లికేషన్లు డిగ్రీ  చేసింది. 

 అనంతరం కొన్ని సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేసింది. అనంతరం ఒక ప్రమోషన్ ఈవెంట్లో ఈమెను చూసిన శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాలో తను పాత్రకు సెట్ అవుతుందని ఆమెని తీసుకున్నారు. ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాలో ఆ పాత్రకి ఆమె చాలా కరెక్ట్ గా సెట్ అయింది. దీంతో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది. అలా ఈ సినిమాలో సోనియాకు స్రవంతి అనే పాత్ర చాలా బాగా కలిసి వచ్చింది. ఇక ఈ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ పురస్కారాన్ని కూడా ఈమె అందుకుంది. దాని తర్వాత  హీరోయిన్ అవకాశాలు కూడా రావడం జరిగింది .

విలేజ్ లో వినాయకుడు, బ్రహ్మ లోకంతో యమలోకం వయ భూలోకం వంటి సినిమాలలో సైతం నటించిన్ ఈమె దాని తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లలో సైతం నటించింది. తెలుగుతోపాటు కన్నడ మలయాళ వంటి సినిమాలలో సైతం నటించింది ఈమె. కానీ అనుకోని విధంగా ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది. 2016లో చివరిగా చిన్న చిన్న ఆశలు నాలుగురేగిన అనే సినిమాల్లో నటించింది. దాని తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది సోనియా. దీంతో తాజాగా ఇప్పుడు ఆమె తన సోషల్ మీడియాలో మహిళలకు సంబంధించిన ఒక వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: