ఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "విడుతలై పార్ట్ 1" మూవీ..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెట్రి మరన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి వాటిలో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను ఈ దర్శకుడు సంపాదించుకున్నాడు. .

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ క్రేజీ దర్శకుడు విడుతలై పార్ట్ 1 అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ భాషలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. తమిళ్ లో ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. తమిళ్ లో మొదట విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న ఈ మూవీ ని ఆ తర్వాత తెలుగు లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశాడు. తెలుగు లో ఈ మూవీ ని విడుదల పేరుతో విడుదల చేశారు.

ఈ మూవీ కి తెలుగు లో కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కమెడియన్ సూరి హీరో గా నటించగా ... విజయ్ సేతుపతి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఈ రోజు నుండి అనగా ఏప్రిల్ 28 వ తేదీ నుండి ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తమిళ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ సినిమా జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తమిళ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: