అజయ్ భూపతికి ఏమైంది ?

Seetha Sailaja

‘ఆర్ ఎక్స్ 100’ మూవీ ఘన విజయం తరువాత ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా దర్శకుడు అజయ్ భూపతి పేరు మాత్రమే వినిపించింది. ఈమూవీ తరువాత మరొక మూవీ తీయడానికి అజయ్ భూపతికి 4 సంవత్సరాల సమయం ఎందుకు పట్టిందో ఎవరికీ అర్థంకాదు. ‘మహాసముద్రం’ అన్న టైటిల్ పెట్టి శర్వానంద్ సిద్దార్థ్ లను హీరోలుగా చేసి తీసిన మల్టీ స్టారర్ ఘోర పరాజయం చెందడంతో అతడికి వచ్చిన పేరు అంతా పోయింది.

మళ్ళీ కొంతకాలం గ్యాప్ తీసుకున్న అజయ్ భూపతి తనకు లక్కీ గార్ల్ గా మారిన పాయల్ రాజ్ పుట్ ను హీరోయిన్ గా చేసి ‘మంగళవారం’ అన్న టైటిల్ తో ఒక క్రైమ్ కథను తీస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోష్టర్ లో పాయల్ రాజ్ పుట్ పూర్తిగా నగ్నంగా వెనుక వైపు నుంచి కనిపిస్తున్నట్లు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోష్టర్ పై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి.

అంతేకాదు వెరైటీ సినిమాలు తీయగల అజయ్ భూపతి ఇలాంటి చీప్ టెక్నిక్ లు ఎందుకు అనుసరిస్తున్నాడు అంటు మరికొందరు అతడిని టార్గెట్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఇది ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సైకో కిల్లర్ సినిమా అని తెలుస్తోంది. వాస్తవానికి పాయల్ రాజ్ పుట్ క్రేజ్ ఏమాత్రం లేదు.

ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమెను కీలక పాత్రలో పెట్టి ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను తీస్తే జనం చూస్తారా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. గతంలో ‘పిల్ల జమిందార్’ లాంటి హిట్ సినిమాను తీసిన అశోక్ అనుష్క ను హీరోయిన్ గా పెట్టి తీసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘భాగమతి ఫ్లాప్ అయింది. ఇప్పుడు అదే రిజల్ట్ ‘మంగళవారం’ సినిమాకు కూడ వస్తుందా అంటూ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ఊహాగానాలు అజయ్ భూపతి కి కలవరపాటును కలిగిస్తాయి అనడంలో ఎటువంటి సందేహంలేదు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: