ప్రభాస్ - సుకుమార్ సినిమా.. స్టోరీ ఇదేనట తెలుసా?

praveen
సినిమా ఇండస్ట్రీలో ఏదైనా క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది అంటే చాలు ఆ కాంబినేషన్ మూవీకి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి వార్త కూడా అటు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్ సెట్ అయింది అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుండడంతో ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాపై ఎవరికి వారు ఊహగానాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎన్నో రోజులుగా ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్లో సినిమా కోసం చర్చలు జరిగినప్పటికీ.. ఎందుకో వీరి కాంబో మాత్రం సెట్ అవ్వలేదు.

 కానీ ఎన్నో రోజుల తర్వాత అభిమానులు అందరూ ఎదురు చూస్తున్న వీరి కాంబినేషన్ ఒక పిరియాడికల్ సినిమా కోసం సెట్ అయింది అన్నది తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభాస్ చేతిలో పలు బిగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆదిపురుష్ రిలీజ్ కి కూడా సిద్ధమవుతుంది. ప్రశాంత్ నీల్ సలార్ కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. ప్రాజెక్టుకే, రాజా డీలక్స్ సినిమా షూటింగులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటి తర్వాత ప్రభాస్ స్పిరిట్ మూవీలో నటించబోతున్నాడు. అదే సమయంలో సుకుమార్ కూడా పుష్ప 2 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

 ఇక పుష్ప 2 కంప్లీట్ అయిన వెంటనే అటు సుకుమార్ ప్రభాస్ తో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ప్రభాస్ ఒకే సమయంలో స్పిరిట్ తో పాటు సుకుమార్ సినిమాలో కూడా నటించబోతున్నాడని సమాచారం. రజాకర్ ఉద్యమం నేపథ్యంలోనే ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్ సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సాయుధ యోధుడిగా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. ఇదే ఈ సినిమా స్టోరీ అంటూ ఒక వార్తా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: