గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తున్న జాన్వీ కపూర్..!!

Divya
హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది .కానీ అక్కడ పెద్దగా గుర్తింపు రాలేక సతమతమవుతోంది. దీంతో తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఇక టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నప్పటినుంచి ఈమె అందచందాలతో మరింత ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల అవుతూ ఉండడంతో పాటు స్టార్ హీరో తోనే ఎంట్రీ ఇవ్వడంతో ఈమె అభిమానులు కాస్త సంబరపడిపోతున్నారు.

తెలుగు ప్రేక్షకులను ఆకర్షించేందుకు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంది. తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా గ్లామర్ను వోలకబోస్తోంది.జాన్వీ కపూర్  తాజాగా గ్రీన్ కలర్ దుస్తులలో తన అందాన్ని డిజైనర్ కాస్ట్యూమ్స్ లో చూపిస్తూ మరింత ఆకర్షించే విధంగా కనిపిస్తోంది.జాన్వీ కపూర్  అద్దాల ఆరబోతకు ప్రతి ఒక్కరు సైతం ఫిదా అవుతున్నారు. సాధారణంగా అందాల ఆరబోత విషయంలో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్స్ కు పోటీగా అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు అంతకుమించి అన్నట్లుగా పలువురు నెటిజన్లో సైతం కామెంట్లు చేస్తున్నారు.
అందాల ఆరబోత ఈ స్థాయిలో ఉంటే తెలుగు ప్రేక్షకులు మరింత ఆదరిస్తారని చెప్పవచ్చు.జాన్వీ కపూర్ స్కిన్ షో చేయడంలో కూడా వెనకడుగు వేయలేదు. బాలీవుడ్లో ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులను నటిస్తున్న జాన్వీ కపూర్ అక్కడ కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఆఖరి రోజు తోనే టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి పలు చిత్రాలలో నటించేందుకు సిద్ధమయ్యింది. శ్రీదేవి కూడా గతంలో ఎన్నో భాషలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.జాన్వీ కపూర్ తన తల్లి లాగే తను కూడా అన్ని భాషలలో నటించి మంచి పేరు తీసుకురావాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: