పవన్ "ఉస్తాద్ భగత్ సింగ్" ఎడిటింగ్ షురూ..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల ... పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ ... హరీష్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత రూపొందుతున్న మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 అలాగే గబ్బర్ సింగ్ మూవీ లో పవన్ పోలీస్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో కూడా పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మరింతగా అంచనాలు పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

 అందులో భాగంగా ఈ మూవీ యొక్క కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ మూవీ యొక్క కొంత భాగం షూటింగ్ పూర్తి కావడంతో ఈ చిత్ర బృందం తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఎడిటింగ్ పనులను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక ఫోటోను కూడా విడుదల చేసింది. ఇలా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా పనులను చక చకా పూర్తి చేస్తూ వస్తుంది. ఈ మూవీ యూనిట్ పవన్ కళ్యాణ్ పై కొన్ని పోలీస్ స్టేషన్ సన్నివేశాలను మరియు పవన్ ... శ్రీ లీల పై మరి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: