ఆ తమిళ స్టార్ హీరో తో పోటీ పడనున్న కోలీవుడ్ కి క్రేజీ హీరో..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే స్టార్ ఇమేజ్ ఉన్న హీరో లలో సూపర్ స్టార్ రజినీ కాంత్ ఒకరు. రజనీ కాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ స్టార్ డం ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇలా తమిళ సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న రజిని ప్రస్తుతం జైలర్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. రమ్యకృష్ణ ... తమన్నా ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో అదిరిపోయే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

 ఇలా ఇప్పటికే తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇది ఇలా ఉంటే కోలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న శివ కార్తికేయన్ ప్రస్తుతం మా వీరన్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ ని కూడా ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే స్టార్ ఇమేజ్ కలిగిన రజిని మూవీ తో శివ కార్తికేయన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతోంది. మరి ఈ మూవీ లలో ఏ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ ప్రజాధరణ పొందుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: