సడెన్ గా 'పుష్ప 2' షూటింగ్ ఆపేసిన సుకుమార్.. కారణం అదేనా..?

Anilkumar
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో 'పుష్ప ది రూల్' మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని మల్కాన్ గిరి ఫారెస్ట్ లో ప్లాన్ చేశాడు సుకుమార్. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ అనూహ్యంగా నిలిచిపోయినట్లు సమాచారం. అందుకు కారణం రీసెంట్గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ తో పాటు సుకుమార్ నివాసంలో ఐటీ సోదరులు జరగడమే. సుమారు ఐదు రోజులుగా మైత్రి ఆఫీస్, సుకుమార్ ఇంటిపై ఐటి రైట్స్ జరిగినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

అయితే ఈ దాడుల్లో ఏం దొరికాయి అనే దానిపై ఐటి అధికారులు ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. సుమారు అయిదు రోజులు జరిపిన ఈ సోదాల్లో ఏం బయటపడ్డాయి అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. కానీ ఈ ఐటీ రైట్స్ వల్ల సుకుమార్ బాగా హర్ట్ అయ్యారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను పుష్ప ది రూల్ షూటింగ్ చేయలేనని.. ఈ ఒత్తిడి నుండి బయటపడేందుకు కనీసం రెండు మూడు వారాలు అయినా తనకు బ్రేక్ కావాలని సుకుమార్ చెప్పారట. దీంతో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న పుష్ప దీ రూల్ షూటింగ్ ఒక్కసారిగా నిలిపివేశారు. ఇక ఐటి రైట్స్ వల్ల నిలిచిపోయిన పుష్ప2 షూటింగ్ మళ్లీ పున: ప్రారంభం అయ్యేందుకు కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఉన్నట్టుండి పుష్ప ది రూల్ షూటింగ్ ఆగిపోయిందనే వార్త బయటకు రావడంతో బన్నీ ఫాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో షూటింగ్ ఆగిపోవడం వల్ల మూవీ రిలీజ్ కూడా ఆలస్యమే అవకాశం ఉంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో పుష్ప పార్ట్ వన్ లో నటించిన నటీనటులతో పాటు విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: